పుట:Sri-Srinivasa-Ayengar.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


నే నున్నచో నిరంతరము మాట్లాడుచుందురని వీరి భార్య, కుమార్తె భావింతురని నాకుతెలిసియు లేచివెళ్లుటకు శ్రీమా౯గారు సమ్మతింపరైరి. నే నేదియుచెప్పక కూర్చుండినను వీరు ఏవృత్తాంతము గూర్చియో కేకలు పెట్టుచుండిరి. 5 నిమిషములు వీరు కన్నులుమూసికొనిన మీదట నిద్రపోవుచున్నారని తలచి వీరి సెలవులేకనే వీరి గదివదలి ఇల్లు చేరుకొంటిని. మరునా డుదయము (19-4-41) నేను స్నానముచేయుచుండగా, 8 గం!కు కాబోలు, శ్రీ ఎన్. డి. వరదాచారిగారు టెలిఫోనుద్వారా శ్రీమా౯గారు ఉదయము 6 గం||లకు మరణించి రనువార్తను తెలియజేయగానే దిక్కుతోచక కొంతసేపు ఇంటివద్దనెయుండి ఆమీద మైలాపూరుకువెళ్లి శ్రీమా౯గారి శవముసు జూచి కంట తడిబెట్టుకొంటిని. ఇంటిలో మనుమడు, మనుమరాండ్రు, నుండుటచే వారి భోజనమునకు ఇబ్బంది కలుగునని తలచి కాబోలు శ్రీ అయ్యంగారి కుమారుడు శ్రీ పార్థసారథి దహనక్రియలను వెంటనే ప్రారంభించెను. మెరినాచివర పోలీసు ఆఫీసు ప్రక్కన మైలాపూరువాసులకు శ్మశానము. కావున