పుట:Sri-Srinivasa-Ayengar.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

91


మదరాసునకు వచ్చుట తటస్థించెను. అప్పుడు 3 రోజులు శ్రీమా౯ బంగళాయందు బసపెట్టుకొనిరి. ఒకరోజు సాయంత్రము శ్రీమా౯గారి భార్యను పిలచి అడ్వకేటు జనరలుపదవిని తమ భర్తగారు వదలిపెట్టినందుకు మీకు విచారము కలుగలేదా అని ప్రశ్నించిరి. అందుకు శ్రీమా౯గారి భార్య ఇప్పుడు మాత్రము నాభర్త దర్జాకు ఏలోపము ఉన్నట్లు నాకు కనబడదు అని చెప్పరి. కాంగ్రెసు సేవకులు నాభర్తగారికి రాజోపచారములు గావించుచు వీరిని ఒక ప్రభువుగ భావించు చున్నందున ఎవరికిని ఏవిచారము లేదని చెప్పిన మీదట గాంధీగారు నవ్విరి. గాంధీగారు ఇంటిలోపలి హాలులో ఉన్నపుడు దొడ్డిత్రోవలో కొందరు వారిని సందర్శించుటకు వారియొద్దకు వచ్చిరి. శ్రీ గాంధీగారు నవ్వుచు ముందుహాలున కాపలాగానున్న శ్రీమా౯గారిని గూడ మీరు ఏమార్చి లోపలికి ప్రవేశించితిరా అని వచ్చినవారిని అడిగిరి. దొడ్డిత్రోవన వచ్చినందుకు శ్రీమా౯ ఇంటివారు బాధపడుటనుజూచి శ్రీ గాంధీగారు ఈ బంగళా ఒక ధర్మసత్రముగ కనబడుచున్నపుడు. ఎవరు లోపలికి రారని వారిని ఓదార్చిరి. మరొక పర్యాయము చెన్నపట్టణమునకువచ్చి, శ్రీమా౯