పుట:Sri-Srinivasa-Ayengar.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


మును ప్రతిపాదింపుమని కోరిరి. శ్రీ సత్యమూర్తిగారు లేచి, తన నాయకులేగాక భారతదేశీయమహాసభ నాయకులలో ప్రముఖులైన శ్రీమా౯ యస్. శ్రీనివాసఅయ్యంగారి సమక్షమున తా నీ తీర్మానమును ప్రతిపాదించి, దీనిపై మాట్లాడుటవల్ల తన కెన్నడు లేని గౌరవము లభించెనని చెప్పుచు గంటసేపు జడివాన కురిపించిరి. జస్టిసు కక్షనాయకులు శ్రీ పానగల్లు రాజాగారిని ఉపన్యాసమున శ్రీమా౯ తూలనాడెనని శ్రీ ఎ. రామస్వామిమొదలియారులేచి బుకాయించెను. కాని శ్రీ సత్యమూర్తిగారు వెంటనే, శ్రీమా౯గారి కాలి బూడ్సును తుడుచుటకు గూడ తాహత్తులేనివారు మంత్రులగుట దేశ దౌర్భాగ్యమును సూచించుచున్నదని చెప్పిరి. ఈ తీర్మానమును జస్టిసు కక్షవారు ఓడించిరి కాని, దీని ఫలితముగ ముందు ఎన్నికలలో అనేకస్థానములను కోల్పోయిరనుట నిర్వివాదాంశము. ఎన్నికలప్పుడు శ్రీమా౯గారి కుమారుడేగాక కుమార్తె శ్రీ అంబుజమ్మాళ్ కొంతప్రచారము సాగించిరి. పైకి కనబడకుండ శ్రీ పార్థసారథి (శ్రీమా౯ కుమారుడు) ఎన్నోపనులను నిర్వర్తించుచుండెను. ఈఎన్నికలన్నిటిలోను కాంగ్రెసు అభ్యర్థులు జయమొందిరని ఇదివరకే చెప్పియుంటిని. 1925 సం!!న గాంధీగారు