పుట:Sri-Srinivasa-Ayengar.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

89


గారు పదిరోజులుండినట్లు తోచదు. శ్రీ టి. ఆర్. వెంకట్రామశాస్త్రి జబ్బుగనున్నపుడు ఈ బంగళాలో నుండగా ఒకమారు వారిని నేను సందర్శించినప్పుడు నెందుకు ఈ బంగళాను శ్రీమా౯గారు నిర్మించిరని నాలో నేను ప్రశ్నించుకొంటిని. శ్రీమా౯గారికి సంగీతమున అభిరుచి లేకున్నను శ్రీ సుబ్రహ్మణ్యభారతి పాటలను అప్పుడప్పుడు వినుటవల్ల అరవపాటలపై మోజు ఏర్పడెను. ముఖ్యముగా దేశీయగీతములను (భారతి గారివి) యెవరైన పాడినచో వారిని అభినందించెడివారు. జస్టిసుకక్షవారు అధికారమున యున్నపుడు శ్రీసుబ్రహ్మణ్యభారతిగారి పుస్తకములను వెలివేసిరి. అప్పుడు మదరాసు శాసససభలో కాంగ్రెసు కక్షవారు కొద్దిమంది సభ్యులుగనుండిరి. కాని వీరిలో ప్రముఖులును అనుచరులును అగు శ్రీ సత్యమూర్తిని ఒక నిరసన తీర్మానము ప్రతిపాదింపుమని తానే తీర్మానము వ్రాసియిచ్చి, ఎన్నడును శాసససభకు వెళ్లని శ్రీమా౯గారు ఈ తీర్మాన ప్రతిపాద నప్పుడు అసెంబ్లీన అధ్యక్షుని పీఠముక్రింద ప్రభుత్వోద్యోగులు కూర్చొసుచోట ఆసీనులైరి. సభ ప్రారంభమయి ప్రశ్నోత్తరములు పూర్తికాగానే అధ్యక్షులు శ్రీ సత్యమూర్తిగారిని తీర్మాన