పుట:Sri-Srinivasa-Ayengar.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


శ్రీమా౯గారు సహాయపడిరి. కాని జడ్జి ఒక్కదమ్మిడీ జుల్మానా విధించెను. ఆ దమ్మిడీని కందస్వామికి పరిహారముగ నివ్వమని చెప్పెను. ఆమీద కార్పరేషను ఎన్నికలో ప్రచారమునకై ఏయింటికి శ్రీ కందస్వామివెళ్లినను ఒకదమ్మిడీశెట్టిగారు వచ్చిరని కేకలువేసి వారికి వోట్లు యివ్వవద్దనిరి. ఈ ఎన్నికలో శ్రీ వి. ఎల్. శాస్త్రి గారికి ప్రచారము సాగించినందుకు గిట్టని దుండగులెవరో కఱ్ఱలతో బాదిరి. ఈ ఎన్నికలనాడు జస్టిసుకక్ష అల్లరివల్ల శ్రీ కందస్వామిగారికి ఓటు ఇవ్వదలచెడివారు గూడ పోలింగు స్టేషనుకు వెళ్లుటగూడ కష్టమాయెను. కావున వీరు అపజయమొందిరి. అనేకులు శ్రీమా౯గారివద్ద ద్రవ్యసహాయము పుచ్చుకొనువారు. శ్రీ కందస్వామివలె సొమ్ము లాగుకొనువారు మరొకరు లేరని అనేకులు భావించుచుండిరి. వీరికి తంబుశెట్టి వీథిలో ఇల్లుగలదుగాని ఆరోగ్యమునకై సెంటుథామస్ మౌంటున ఒక ఇంటిని నిర్మించుకొని చెన్నపట్టణపు ఇంటిని అద్దెకిచ్చి మౌంటు ఇంటిలో వాసముండెడివారు. తాజెడ్డకోతి వనమెల్లజెరచెనసు లోకోక్తి ప్రకారము శ్రీమా౯గారిని ప్రోత్సహించి, మౌంటులో తన యింటిసమీపమున నొక బంగళా నిర్మించుకొనునట్లుచేసిరి. ఈబంగళాలో శ్రీ అయ్యం