పుట:Sri-Srinivasa-Ayengar.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


బంగళాన బసచేసినపుడు శ్రీమా౯గారితో ప్రథమమున నేను మీ ఇంటివాకిలి గదిలో నుంటిని. రెండవపర్యాయము నేను ఇచ్చటికి వచ్చినపుడు లోపలి హాలునకు వెళ్లితిని. మూడవ పర్యాయము నేను వచ్చినపుడు నా భార్యను వంట ఇంటికే తీసికొని వెళ్లితిని. కావున విలువ క్రమేణ ఏర్పడినదని తలచుచున్నాను' అనిరి. శ్రీ గాంధీ శ్రీమానుల మధ్య అభిప్రాయభేదములు గలవుకాని శ్రీ గాంధీగారిపై శ్రీ మాణ౯గారికి ఒకమోస్తరు గౌరవముండెడిది. కావుననే అప్పుడప్పుడు వారి గుణాతిశయములను గూర్చి ఇంటికివచ్చినవారితో ముచ్చటించెడివారు. శ్రీ గాంధీగారు తమయింట బసచేసినపుడు శ్రీ గాంధీగారి ప్రక్కన కూర్చొని అన్నిపనులను జూచెడువారు.

జాతీయవాదులు యెవరుగాని కారాగారములను ప్రవేశించుట పనికిమాలినపని అని శ్రీమా౯గారు అభిప్రాయపడుచుండెడివారు. తాను కావలెనని కారాగారప్రవేశము ఎన్నడును కోరననియు, అధికారులు పట్టుబట్టి తన్ను నిర్బంధించినచో విధిలేక కారాగారమున నుందుననియు, తన కెన్నడును కారాగారభయము లేదనియు చెప్పెడివారు.