పుట:Sri-Srinivasa-Ayengar.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

85


సందర్భములలో గావించిరనియు చెప్పినమీదట సభాధ్యక్షుల వందనములతో సభ ముగిసెను.

స్వరాజ్యపార్టీ

శ్రీ చిత్తరంజనదాసుగారు చెన్నపట్టణమువచ్చి కొంతప్రచారము సాగించినమీదట శ్రీ ఏ. రంగస్వామిఅయ్యంగారు, శ్రీ యస్. సత్యమూర్తి, శ్రీ వేమవరపు రామదాసుషంతులు మున్నగువారు బైటిజిల్లాలలో స్వరాజ్యకక్షకై ప్రచారము సాగించిరి. నేను దక్షిణ ఆర్కాటు, నెల్లూరుజిల్లాలకు శ్రీదాసుగారిని తీసికొనివెళ్లితిని. కడలూరు, విళుప్పురము, చెంగల్పట్టు, గూడూరు, నెల్లూరు మున్నగుచోట్లలో శ్రీ దాసుగారు గావించిన గంభీరోపన్యాసములను విన్న వేలకొలది ప్రజలలో కొంత సంచలన మేర్పడి అనేకులు స్వరాజ్యకక్షలోచేరి ఎన్నికలలో పాల్గొనుటకు నిశ్చయించుకొనిరి. ఎన్నికలలో ఈస్వరాజ్య కక్షవారికి మద్రాసు శాసనసభలో మెజారిటీ లభింప లేదుగాని కొన్నిస్థానములు వీరి యధీనమాయెను. అప్పట్లో కాంగ్రెసు వ్యవహారములను నిర్వహించు చుండిన శ్రీమా౯ యస్. శ్రీనివాసఅయ్యంగారు స్వరాజ్యకక్షలోచేరుటకు వీలుకాదని చెప్పిరి. శ్రీ ముత్తురంగమొదలారి హమిద్‌ఖాను శ్రీస్వామి