పుట:Sri-Srinivasa-Ayengar.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


వెంకటాచలంశెట్టి మున్నగు అనుచరులతో వ్యవహరించెడివారు. వీరందరును శ్రీమా౯గారి సహాయమున జస్టిసుకక్షవారిని ఓడించి మదరాసు కార్పరేషనున ప్రవేశించియుండిరి. దీనికిముందే కార్పరేషను సభ్యులైన శ్రీ సత్యమూర్తిగారికున్న వాగ్ధోరణి, అనుభవము, వాదనైపుణ్యము వీరికి లేనందున శ్రీ సత్యమూర్తిగారే కార్పరేష౯ కాంగ్రెసు పార్టీకి నాయకులైరి. అందుకై పై శ్రీ మొదలారి, శెట్టి మున్నగువారికి శ్రీ సత్యమూర్తిపై అసూయ జనించి ప్రతిరోజు శ్రీమా౯ గారిని సందర్శించుచు శ్రీ సత్యమూర్తిపై నిందల నారోపించుచుండెడి వారు. ఈ కారణమువల్ల శ్రీమా౯గారి మనస్సున మార్పు జనించి శ్రీ సత్యమూర్తిగారని నిరసింప ప్రారంభించిరి. శ్రీ సత్యమూర్తిగారు ఢిల్లీ అసెంబ్లీ సభ్యులైనమీదట శ్రీమా౯గారికిని శ్రీ సత్యమూర్తికిని వైషమ్యములు హెచ్చాయెను. ఇందుకుకూడ ఢిల్లీ అసెంబ్లీసభ్యుడైన శ్రీ ముత్తురంగ మొదలారి శ్రీ వెంకటాచల శెట్టిగారలే ముఖ్య కారకులని నిష్కర్షగా చెప్పగలము. బాహ్మణులపై జస్టిసు పార్టీకున్న నిరసనభావము కాంగ్రెసునందలి బ్రాహ్మణేతరులలో కలదు కావుననే నాటిమొదలు నేటివరకు కాంగ్రెసున ఎన్నియోకలతలు ఏర్పడియున్నవి.