పుట:Sri-Srinivasa-Ayengar.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


జనము హాలులోను, రెండుమూడువేలమంది ప్రజలు బయటను కూడియుండుటను జూచి కారుమీద హైకోర్టుకు వెళ్లగా శ్రీమా౯ కోర్టున ఒకకేసు పూర్తిగావించుకొని 2 గంటల మొదలు కోర్టున ఒక కేసున వాదించుచుంటిననియు, బడలికగా నున్నాననియు, సభకువచ్చుట కష్టమనియు చెప్పిరికాని నా ప్రోత్సాహమువల్ల సభకువచ్చి నాపరువును దక్కించిరి. వీథిన వేలకొలదిజనము మూగియుండు టనుజూచి, అందరు బయటనున్నప్పుడు హాలులోని కొందరికిమాత్రము వినునట్లు సభాక్రమముసాగుట వారికి మనస్కరింపక యుండెను. కాని సభను ప్రారంభించి, చక్కని యుపన్యాసముసాగించి, ఇతరు లెవ్వరిచేతను చేయసాధ్యము కాని పనులను నిర్వహించుశక్తి శ్రీసత్యమూర్తిగారికి కలదనియు, ధైర్యముగ చక్కని యుపన్యాసములను గావించుట వీరి కలవాటనియు, ఆంగ్లమునందేగాక అరవమున గూడ ఎన్నియో సభలలో వీరుపన్యసించియున్నారనియు, వీరి యుపన్యాసముల విన్నవారు ఇంగ్లాండున వీరిని అభినందించుచున్నారనియు శ్రీమా౯గారు చెప్పిరి. చివర శ్రీ సత్యమూర్తిగా రుపన్యసించుచు తన కృతజ్ఞతను వెలిబుచ్చుచు శ్రీమా౯గారికి తాను శిష్యుడనియు, తనకు వా రెంతో సహాయము అనేక