పుట:Sri-Srinivasa-Ayengar.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

83


ఓట్లన్నియు జస్టిసు కక్షవారికే లభించునని కొందరు చెప్పుచున్నారు. ఇందుకు ప్రతీకారముగ మనము ఏదైన కృషిసాగింపనిచో ఏమియు ప్రయోజనము లే'దని అనెడివారు. 'శ్రీనివాసయ్యంగారూ, ఎందుకు మీరు భయపడుచున్నారు? జస్టిసుకక్ష తుడుచుకొనిపోవుట నిజము, వీరు వారు చెప్పుమాటలను తామువినక ఫలితమును ఎదురుచూడగోరితిని. ఇదే నాసలహా' అని శ్రీ సత్యమూర్తి చెప్పెడివారు. ఈమాటలను వినగానే శ్రీమా౯గారు సంతృప్తిచెంది. 'అయినను మనము అశ్రద్ధగనుండరాదు. చేయదగినప్రయత్నము లన్నిటిని సాధించినగాని కొంతకాలము అధికారముననున్న కక్షవారిని పడగొట్టుటకు వీలుకాదు.' అని చెప్పెడువారు. శ్రీ సత్యమూర్తిగారు ఇంగ్లాండున రాజకీయ ప్రచారము జయప్రదముగ సాగించి చెన్నపట్టణమునకు రాగానే వారి గౌరవార్థము నేను సౌందర్య మహలులో ఒక మహాసభను సాగింపదలచి శ్రీమా౯గారిని ఆ సభకు అధ్యక్షులుగ నుండుడని కోరితిని కాని మొదలు వీరు అంగీకరించక ఆమీద సభకువచ్చుటకు సమ్మతించిరి. సభ 5 గంటలకు ప్రారంభమగునని ప్రకటింపబడినందుచే వేలకుపైగా -