పుట:Sri-Srinivasa-Ayengar.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


తమ పత్రికాప్రచారము గ్రంథవిక్రయము హెచ్చగుటకు నిరంతరము పాటుబడుచు 'హోంరూలు' రోజులలో శ్రీ సి. పి. రామస్వామిఅయ్యరుగారివద్ద కొన్నివేలు పుచ్చుకొన్నట్లే శ్రీమా౯గారివద్ద గొప్పమొత్తములను పుచ్చుకొనుచుండిరి. వీరిని శ్రీ ఆనిబిసెంటు ఒక కార్మికనాయకునిగావించెనుగాని శ్రీ మొదలారి స్వార్థమువల్ల కార్మిక ఉద్యమము క్రమేణ పాడాయెను. ఈ మొదలారేకమ్యూనిష్టుల పిలిచి శ్రీ వాడియా, శ్రీ అరండేలు మున్నగువారు యెంతో శ్రమపడి నిర్మించిన మదరాసు లేబరు యూనియసును కమ్యూనిష్టులకైవశముగావించిరి.

చాలరోజులు శ్రీమా౯గారికి అభిమాన మధికముగనుండెను. అప్పట్లో తనకారును పంపి శ్రీ సత్యమూర్తిగారిని తమ బంగళాకు పిలిపించెడువారు. కొద్దిరోజులలో ఉదయము వెళ్లినకారు 12 గం!! వరకు తిరిగి రానప్పుడు డ్రైవరును ప్రశ్నింపగా శ్రీసత్యమూర్తిగారు స్నానముచేసి, తిండితిని బయలుదేరి వచ్చినందుచే ఆలస్యమాయెనని చెప్పెడివారు. కారు దిగగానే శ్రీసత్యమూర్తి శ్రీమ౯గారిని సమీపించి 'అయ్యా ! నన్నేల పిలిపించితిరి' అని అడిగెడువారు. అందుకు శ్రీమా౯ 'మనడివిజ౯లో మనకు ఓట్లురావని వినుచున్నాను.