పుట:Sri-Srinivasa-Ayengar.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

81


చెప్పినమీదట డ్రైవరు అతివేగముగ కారును వదలెను. కారుటాపుమీద రాళ్లుపడెనుగాని మరియే అపాయము లేక శ్రీమా౯గారు బంగాళాచేరిరి. కాంగ్రెసు పనులలో శ్రీ సత్యమూర్తి, శ్రీ రంగస్వామి అయ్యంగారు, శ్రీ కల్యాణసుందర మొదలారి, శ్రీ ముత్తురంగమొదలారి, జనాబ్ హమీద్‌ఖాను, జనాబ్ షాఫీమహమ్మద్, నేను, జయవేలు శ్రీమా౯గారి యింటికి పలుమారు వెళ్లుచుండెడివారము. శ్రీ కల్యాణసుందర మొదలారి జస్టిసుకక్షలో చేరుటకు నిరాకరించినందున వారిపై శ్రీమా౯గారికి అభిమాన ముండెడిదిగాని నావంటివారు శ్రీ మొదలారిగారికి కూడ కొంత బ్రాహ్మణద్వేషము కలదని గుర్తింప గల్గితిమి. శ్రీ మొదలారిగారి అరవభాషయందలి చక్కని పాండిత్యమునకు నేనేగాక శ్రీ సత్యమూర్తి వంటివారుగూడ వారిని ప్రశంసించెడివారేకాని, వారిని నాయకులుగ నెన్నడును పరిగణింపలేదు గావున శ్రీమా౯గారు నావర్తనను ఆక్షేపించెడివారు. తామేదైన అరవమున ప్రచురింపదలచినచో శ్రీ అయ్యంగారు శ్రీ కల్యాణసుందరమొదలారిగారిని సవరింపుమని కోరెడివారు. శ్రీ కల్యాణసుందరమొదలారి యెందున కాని పట్టుదల చూపువారు కారు.