పుట:Sri-Srinivasa-Ayengar.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


చోట్లలో రాళ్లు విసరిరో, ఎచ్చట అల్లరిసొగెనో మున్నగు వివరములను తెలిసికొనెడివారు. దైవకృపవల్ల ఏలాటి అపాయములేక శ్రీమా౯ ఇల్లు చేరినందుకు సంతృప్తిని చెందెడివారు. రాత్రి రేడియో ద్వారా నిరంతరము వీరు అభ్యర్థులకు గావించు సలహాలవల్ల ఎంతయో నెమ్మదియైన పరిస్థితి ఏర్పడెను. మదరాసు నగరమున జస్టిసు కక్షను తుదముట్టించుటకు వీరు కనఁబఱచిన పట్టుదల, శ్రద్ధ ఎవరును చూపరైరి. దానివలన వీరు ప్రవేశించని వీథిగాని, సందుగాని, ఇల్లుగాని లేనందున జస్టిసు కక్షవారు వ్యక్తి దూషణకు ప్రాముఖ్యత నివ్వసాగిరి. దాదాపు 20 సం||లకు పైగా బ్రిటిషు అధికారులదయకు పాత్రులైన జస్టిసు ప్రముఖులు మూలబడిరి. ఒకరోజున చెంగల్పట్టుజిల్లా ఎన్నికల ప్రచారమునకై ఉదయము బయలుదేరి వెళ్లి రాత్రి 12 గంటలకు బంగాళా వచ్చి చేరిరి. చెంగల్పట్టు సమీపమునందలి చెరువుమీద కారువెళ్లుచుండగా దుండగులు కొందరు అచ్చ టచ్చట బాటలందు కొన్ని చెట్లను పడవేయుటయే గాక ఒక ఇరుకు ప్రదేశమున కఱ్ఱతో వీరిని కొట్టవలయునని యత్నించిరి. ఇది శ్రీమా౯ గారికి ముందే తెలిసినందున ధీరుఁడగు ముస్లిం డైవరుతో వారు కొట్టుటకురానీ ఒక చేయి చూచుకొందము అని