పుట:Sri-Srinivasa-Ayengar.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

79


మణి, సర్ శ్రీసురేంద్రనాథ బెనర్జి మున్నగువారిని ఓడించిరి గావున స్వరాజ్య కక్షవారన్ని చోట్లలోను ప్రాముఖ్యత చెందవీలాయేను. మదరాసు రాష్ట్రమున జస్టిసుకక్ష ప్రముఖులగు శ్రీ పానగల్లురాజా, సర్" ఎ. పి. పాత్రో, సర్ శ్రీ శివజ్ఞానము మున్నగు వారందరు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అపజయమొందిరి. శ్రీ ముత్తురంగ మొదలారి, శ్రీ సత్యమూర్తి, శ్రీ కె. భాష్యం మున్నగువారు గెలుపొందిరి. శ్రీమా౯ అయ్యంగారు అభ్యర్థిగ నిలచి ఢిల్లీ అసెంబ్లీ సభ్యులైరి. ఈఎన్నికల ప్రచారము శ్రీమా౯ నాయకత్వమున సాగునపుడు వీరి సంచారమున రోజూ ఉపన్యాసములును, అనేకచోట్లలో సభలు సాగించినందుచే వీరికి తీరికయే లేకయుండెను. ప్రతికూల కక్షవారనేకులు వీరిని తూలనాడిరి గాని వీరు నిర్లక్ష్యముగ నుండిరి.

చెన్నపట్టణమున ఉన్నప్పుడు ఉదయము బయటికి బయలుదేరినచో రాత్రి 11, 12 గంటలకు మరల ఇంటికి వచ్చెడివారు. ఇంటికిరాగానే ఇంటివారందరు నిద్రలేక చీకాకుషడుచుందురు. డ్రైవరు, వీరితో కారునవెళ్లిన కాంగ్రెసు అనుచరులు మున్నగువారిని ఇంటివారు ప్రశ్నించి ఏయే