పుట:Sri-Srinivasa-Ayengar.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


ర్థులనునిలిపి జస్టిసుకక్షను తుదముట్టింపవలెనని వెల్లడించి కాంగ్రెసు కక్షవారిని కొందరిని మదరాసు కార్పొరేషను ప్రవేశించునట్లు చేసి శ్రీసామివెంకటాచలముశెట్టికి మేయరుపదవి లభించునట్లు చేసిరి. కార్పొరేషను ఎన్నికకు నిలువఁబెట్టిన 10 మందిలో 7 గురుమాత్రమే ఈఎన్నికలో జయమొందిరి. అదిమొదలు శ్రీమా౯గారు కార్పొరేషను వ్యవహారములలో పూర్తిగా జోక్యము కలిగించుకొని తనఅభిప్రాయమును అనుచరులద్వారా ఆచరణలో పెట్టుచుండిరి. శ్రీ సి. ఆర్. దాసు గారు అప్పటికి ముందే కలకత్తా కార్పోరేషను తనకైవశము గావించుకొనిరి. కాంగ్రెసు కక్షవారికి మదరాసు రాష్ట్రమున ప్రాముఖ్యత కుదిర్చిన మీదట ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలకై శ్రీమా౯ అయ్యంగారే గాక కాంగ్రెసుకక్షవారనేకులు రేయుంబవళ్లు పాటుపడిరి. మదరాసునందే కాక పై జిల్లాలలోగూడ ఎన్నడునులేని ఉత్సాహము జనించునట్లు శ్రీమా౯గారు ప్రచారముసాగించిరి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో స్వరాజ్యకక్షవారు ప్రముఖ మితవాదులగు డాక్టరు సర్ శ్రీపరంజపై , సర్ శ్రీ సి. వై . చింతా