పుట:Sri-Srinivasa-Ayengar.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

77


రాజాజీ సభలో ఉపన్యాసముగూడ గావించెను. తిరునల్వేలి మహాసభలో శ్రీ కస్తూరిరంగయ్యం గారు వర్తించినట్లు గయలో శ్రీ సరోజినీదేవి వర్తించుట శ్రీమా౯ గారికేకాక అనేకులకు అసంతృప్తి కలిగించెను. ఎంతజెప్పినను శ్రీమా౯ వినక తనసభను సాగింపక బసలో నిద్రించిరి.

గయకాంగ్రెసు సమావేశమైన పిదప కాంగ్రెసున రెండు కక్షలేర్పడెను. శాసనసభలను కాంగ్రెసు బహిష్కరింప వలెనసు కక్షకు శ్రీ రాజగోపాలాచారిగారు నాయకులైరి. శాసనసభలలో కాంగ్రెసువారు ప్రవేశించి కార్యక్రమము సాధనచేయుటయే విధియని తలచిన స్వరాజ్యకక్షకు శ్రీ సీ. ఆర్. దాసుగారు నాయకులుగా గణింపఁబడిరి. తొమ్మిది మాసములు ఈరెండుకక్షలును దేశమంతట వారి సిద్దాంతములకై ప్రచారము సాగించిరిగాని ఆ మీద ఉభయ కక్షలలోనివారు ఒకమోస్తరు రాజీ గావించుకొనిరి. మతసంబంధమైన ఆక్షేపణయో వారి అంతరాత్మయో అడ్డముతగలనిచో ఇష్టమున్న వారు శాసనసభలను కాంగ్రెసుపక్షమున ప్రవేశింప వచ్చునని పై రాజీ సూచించెను.

చెన్నపట్టణము రాగానే శ్రీమా౯గారు మదరాసు కార్పరేషను ఎన్నికలకు కాంగ్రెసు అభ్య