పుట:Sri-Srinivasa-Ayengar.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


సరోజినీదేవి బసచేయుటకు క్లబ్బునకువచ్చి చేరెను. ఈక్లబ్‌కన్న చక్కనిప్రదేశము గయలోలేదు కావున మరికొందరు ప్రముఖులుకూడ క్లబ్బున బసకుదుర్చుకొనిరి.

జనసమ్మర్దము హెచ్చైనందున శ్రీమా౯గారు మరొకచోటికి బసను మార్చిరి. కాని తిండికి మాత్రము శ్రీ సరోజినీదేవిగారు మాత్రమేకాక, కె. భాష్యం, వీరితమ్ముడు సంతానము, వీరిభార్య, శ్రీ యం. కె. ఆచార్య, శ్రీ వి. ఎల్. శాస్త్రి మున్నగువారు వచ్చుచుండిరి. ఇందరికి భోజనాలు సిద్ధము గావించుటకు శ్రీఅయ్యంగారి వంటమనిషి. కస్తూరికి శ్రమకలిగెనుగాని ఇందరికిని సంతృప్తిగా ఆహార పానీయములను సకాలమున సిద్ధముచేయుచుండెను. నాటిరాత్రి శ్రీమా౯గారు తన సవరణ తీర్మానమును గూర్చి కాంగ్రెసుమహాసభ ఆవరణమున సభసాగించుటకు నేను, శ్రీ వి.ఎల్.శాస్త్రి, శ్రీ నేలనూతుల సుబ్బరాయుడు మున్నగువారు అన్ని ఏర్పాట్లనుగావించి, భోజనమునకై ఇంటికిరాగా, మరల మేముసభకువెళ్లులోగా శ్రీ రాజగోపాలాచారిగారు మేము నిర్దేశించిన ప్రదేశమున సభసాగించి శ్రీమా౯ తీర్మానమునకు విరుద్దముగా ఒక తీర్మానము నెగ్గించిరి. ఈసభకు వెళ్లనని మాకు మాటయిచ్చిన శ్రీ సరోజినీదేవి