పుట:Sri-Srinivasa-Ayengar.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

75


నకు ఆంధ్రడెలిగేట్లెవరును రాను వీలుకాదని తానొక ప్రకటనగావింప దలచినాననిచెప్పి అధ్యక్షుని హోదాలో తనకుతోచిన అయిదారుగురిని మాత్రమే డెలిగేట్లుగా పరిగణింతురని విస్పష్టము గావించిరి.

ఆమీద మరి కొంతసేపు శ్రీమా౯, శ్రీదాసు సంభాషించినమీదట నేను, శ్రీ అయ్యంగారు శ్రీ చమేరియా బసకు వచ్చిచేరితిమి. నాటిరాత్రి, తాను గయకుబయలుదేరనని శ్రీ సి. ఆర్.దాసు గారు చెప్పిరి. వంద బెంగాలు డెలిగేట్లతో మరునాడు ప్రయాణము. సాగింతుననియు, మరికొందరి రాకను ఎదురుచూచు చున్నాననియు వారు చెప్పియుండిరి. కాని స్పెషలు ట్రెయినున వెళ్లినచో శ్రమకు పాత్రుడనగుదునని శ్రీమా౯భావించిరి. ఆరాత్రియే నేను, వారు గయకు, ప్రయాణమైతిమి. ఉదయమునకు పాట్నాకు చేరితిమి.అచ్చట శ్రీమా౯ రాజగోపాలాచారిగారు నాకు కనఁబడిరిగాని మాపెట్టెలోకి రమ్మని కోరగా తాను ఇంటరుక్లాసుస కొందరు అనుచరులతో ప్రయాణము చేయుచున్నందున గయలో కలుసుకొందుమని చెప్పి వెళ్లిరి. సర్ తారకనాథ్‌పాలిత్ గారి అల్లుడును సుప్రసిద్ధన్యాయవాదియు నగు డులిప్‌సింగు శ్రీమానునకు గయక్లబ్బున బస కుదిర్చెను. మేము క్లబ్బున బసచేయగానే కొన్నిగంటలకు శ్రీమతి -