పుట:Sri-Srinivasa-Ayengar.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


నగు శ్రీ సి. ఆర్. దాసుగారు జడ్జిపదవికి రాజీనామా ఇచ్చి తమ్మునిచూచుటకై వచ్చిరి. వీరురాగానే శ్రీ సి.ఆర్. దాసుగారు సిగరెట్ త్రాగుటనుచూచి అన్నిటిని వదలిపెట్టిన నీవు ఈపాడుసిగరెట్లుకాల్చు అలవాటును ఏల వదలిపెట్టలేదని ప్రశ్నించగా తనముందున్న బంగారు సిగరెట్టుకేసును కీటికీగుండా వీధిన పాఱవైచిరి. ఇందుకు అందరు ఆశ్చర్యచకితులైరి గాని, త్యాగమూర్తియగు దాసుగారునిర్లక్ష్యముగనుండిరి. శ్రీదాసుగారు తన అధ్యక్షోపన్యాసమందలి కొన్ని భాగములను శ్రీమా౯గారికి వినిపించి, ఆమీద రాజకీయ పరిస్థితులనుగూర్చియు, శ్రీ గాంధీగారి మొండిశిఖండిత్వమును గూర్చియు ముచ్చటించిరి. ఈలోగా నాటి అమృతబజారు పత్రిక రాగా దానిని శ్రీమా౯గారు చదువుచుండగ ఈలోగా నేను ఆంధ్ర కాంగ్రెసుకమిటీ ఉపాధ్యక్షుఁడనియు, డెలిగేట్ల ఎన్నికలపై ఏసమావేశము జరుగలేదనియు, శ్రీ పట్టాభి సీతారామయ్య మున్నగువారు తమకు తోచినపేళ్లను కొన్నిటిని నమోదుగావించిన ఒక లిష్టును, ఈదురన్యాయములన్నియు తనకు బారిష్టరు ఉన్నవ లక్ష్మీనారాయణగారు నాటిఉదయమే తెలియఁజేసిరనియు చెప్పిరి. డెలిగేట్ల (ఆంధ్ర) ఎన్నిక నక్రమముగ సాగనందుచే గయకాంగ్రెసు