పుట:Sri-Srinivasa-Ayengar.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

73


ఇల్లు వాకిలినుండి కత్నకంబళ్లతో కప్పఁబడి యుండెడిది. వీరు సునాయాసముగ బారిష్టరు వృత్తిలో నెలకు 30, 40 వేలు ఆర్జించెడివారు. ఆరోజులలో వీరు దుస్తులు 3 గంటలకు ఒకమారు మార్చెడివారు. ఇట్టి దేశత్యాగి సర్వస్వమును త్యజించి మేడమీద ఒక కొయ్య కుర్చీమీద కూర్చొని ఒక ముతకకంబళిని పైనకప్పుకొని గయ కాంగ్రెసుకు అధ్యక్షోపన్యాసము షార్టుహాండు టైపిస్టుచే వ్రాయించుచుండిరి. వారిముఖము చూడగానే నామనస్సున ఎన్నడునులేని సంకటము గలిగి మాటతోచక కొంతసేపుంటినిగాని వారు సన్ను ఆదరించి వచ్చినపనిని సూచించుమని కోరిరి. గయకాంగ్రెసునకు శ్రీమా౯గారు, నేను వెళ్లుచు మార్గమున శ్రీమా౯గారిని తమకు పరిచయము చేయుటకు కలకత్తాలో ఆగినట్లు చెప్పగానే వారిని లోపలికి దయచేయుమని ఏల చెప్పలేదని ప్రశ్నించిరి. వారు చమేరియాభపనమున ఆహారము పుచ్చుకొను చున్నారనియు, సెలవైనచోవెళ్లి పిలుచుకొనివచ్చెద ననియు చెప్పతిని. ఆమీద శ్రీమా౯గారిని వెంటబెట్టుకొని శ్రీ దాసుగారివద్దకు వచ్చితిని. పాట్నా హైకోర్టుజడ్జియు శ్రీ సి. ఆర్. దాసుగారి సోదరులు