పుట:Sri-Srinivasa-Ayengar.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


భోజనమునకు ముందు తలంటి స్నానముగావించి చేయుదు మంటిమి. శ్రీమా౯ ఆయ్యంగారు కావలసిన ఆహారము సిద్ధమగుటకు వ్యవధియగునని తలచి నన్ను చమేరియా సిద్దముగావించిన యాహారముభుజించి వెంటనే కారున శ్రీ సి. ఆర్. దాసుగారింటికి వెళ్లుమని ఆదేశించిరి. నేను భోజనము చేయగానే శ్రీ చమేరియా కుమారుని పిలచి నన్ను శ్రీ సి.ఆర్. దాసుగారి ఇంటికి కారున తీసికొని వెళ్లుమనిరి. నేను కారుఎక్కుచు తిండితినగానే శ్రీమా౯ గారిని శ్రీ సి. ఆర్. దాసుగారివద్దకు రమ్మని కోరుచు వారికై కారును పంపివేయుదునని చెప్పితిని. కాని ఎన్నిగంటలకు తాను రావలేనో శ్రీ సి. ఆర్ . దాసుగారు నిష్కర్షగా నాతో చెప్పినగాని తాను బయలుదేరనని చెప్పిరి.

శ్రీమా౯గారితో చర్చించుటవల్ల లాభముండదని నాకు తెలియుటవల్ల చమేరియా కుమారునితో బయలుదేరి రస్పారోడ్డునకు వెళ్లితిని. గొప్పకారు కావున అయిదారు మైళ్లలోనున్న శ్రీ సి. ఆర్. దాసు గారింటికి కొన్ని నిమిషములలో చేరుకొని, పైకి వెళ్లితిని. శ్రీ సి. ఆర్. దాసుగారి భవనమువారు సహాయ నిరాకరణోద్యమములో చేరుటకు ముందు వారి