పుట:Sri-Srinivasa-Ayengar.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

71


గారును, డెలిగేట్లలిష్టునువ్రాసి అధ్యక్షులగు శ్రీ సి. ఆర్. దాసుగారికి అందించిరి. అప్పటికే నాకు శ్రీ సి. ఆర్. దాసుగారితో చక్కనిపరిచయ మేర్పడియుండెనుగాని శ్రీమా౯ఆయ్యంగారు శ్రీ సి. ఆర్. దాసుగారిని ఎరుగరు. అందుచే మేము మదరాసు నుండి 4 రోజులు ముందుగా ప్రయాణమై కలకత్తా చేరితిమి. కలకత్తాన గొప్పమార్వాడీ సాహుకారు శ్రీమా౯గారి కక్షిదారుడు గావున వారిభవనమున బసయేర్పాటాయెను. బ్రహాండమైన మోటారుకారున శ్రీమా౯ అయ్యంగారిని, నన్ను శ్రీచమేరియా కుమారుడు హౌరాస్టేషనునుండి వారిబసకు తీసికొని వెళ్లి వారి భవనమునఁ జేర్చిరి. మదరాసువంటవారిచే అద్భుతమైన వంటలగావించి, స్నానమునకై నూనె, శీకాయి మున్నగువాని నిప్పించిరి. నౌకరులు ముందు శ్రీమా౯ అయ్యంగారి వంటమనిషి స్నానమునకు ఏర్పాట్లు గావించిరి. వంటమనిషి స్నానముచేయగానే శ్రీమా౯గారికిని నాకును తలాఒక కప్పుకాఫీ తెచ్చియిచ్చి మరల భవనములోనికి వెళ్లెను. కొంతసేపటికి మావద్దకువచ్చి వంటప్రారంభించితిననియు, పావుగంటలో అన్నియు సిద్ధమగు ననగా మేము