పుట:Sri-Srinivasa-Ayengar.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


ముగ శ్రీ సి. రాజగోపాలాచారిగారి తీర్మానమునకే ఆమోదము సూచించిరని అనేక కాంగ్రెసు డెలిగేట్లు గుర్తించిరి. ఇట్టి సందర్భమున శ్రీమా౯ అయ్యంగారు తన సవరణతీర్మానమును ప్రతిపాదింప యత్నించిరికాని శ్రీ రాజగోపాలాచారిగారు ఇందుకు సమ్మతింపరైరి. కావున శ్రీ రాజగోపాలచారిగారి అభీష్టమే నెరవేరెను.

గయ కాంగ్రెసునకు శ్రీమా౯అయ్యంగారితో నేను పెళ్లియుంటిని. అప్పుడు నేను ఆల్ ఇండియా కాంగ్రెసున సభ్యుఁడుగనుంటిని కావున, అనేక విచిత్రాంశములను గుర్తింపగలిగితిని, దేశాభిమానులమనియు, స్వార్థత్యాగముచేసినామనియు చెప్పుకొను నాయకుల వర్తనల చూడగ అనేకులకు అసహ్యము పుట్టించెను. తెనుగువారిలో శ్రీ కొండా వెంకటప్పయ్యకును, శ్రీ పట్టాభి సీతారామయ్యకు ఉన్న విభేదములవల్ల సకాలమున ఆంధ్రరాష్ట్రకాంగ్రెసు సభ డెలిగేట్ల ఎన్నికను సాగింపక కాలహరణము గావించి చివరకు గయలో పిండములు పెట్టుటకు, వచ్చిన వితంతువులను గూడ జేర్చి, శ్రీ పట్టాభిసీతారామయ్యగారు, శ్రీబ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణ్యము