పుట:Sri-Srinivasa-Ayengar.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

69


కారములేదనియుచెప్పి ఒక స్టేటుమెంటును వ్రాసి చదివిరి. ఈవిధముగ బ్రిటిషు ఆధికారవర్గమును గాంధీ తృణీకరించినందుకు భారతీయులేగాక విదేశీయు లెందరో సంతృప్తిజెందిరి. 1922 సం|| డిసంబరు 25 వ తేదీన గయలో కాంగ్రెసు సమావేశము అగుటకు ఏర్పాట్లుగావించిరి. శిక్షాకాలము పూర్తియయి విడుదలగావింపఁబడిన శ్రీ సి. ఆర్. దాసుగారు ఆధ్యక్షులుగా ఎన్నుకోఁబడిరి. ఈకాంగ్రెసున పండిత శ్రీమోతీలాలు 1923 సం!! న సాగింపఁబోవు రాష్ట్ర, ఢిల్లీ శాసనసభల ఎన్నికలలో కాంగ్రెసుకక్షవారు పాల్గొనవలెననెడి తీర్మానమును ప్రతిపాదింపసంసిద్ధులైరి. ఇందుకు శ్రీ సి. ఆర్ . దాసుగారుకూడ ఆమోదమునుసూచించిరి. కాని శ్రీగాంధీగారు కారాగారవాసీగాఉన్నప్పుడు ఇట్టి తీర్మానమును ప్రతిపాదించుట గొప్పపొరబాటని శ్రీ సి. రాజగోపాలాచారిగారు తిరుగబడిరి. అంతటితో తృప్తిజెందక శాసనసభలతీర్మానము నొకదానిని వీరు ప్రతిపాదించిరి. ఆమీదట గయకాంగ్రెసున రెండుకక్షలు ఏర్పడెను. శ్రీ రాజేంద్రప్రసాదు గారు రెండుకక్షలను సంతృప్తి గావింపఁదలచి కాబోలు తన అభిప్రాయమును ఉపన్యాసమున వెల్లడింపరైరి. కాని లోలోపల రహస్య