పుట:Sri-Srinivasa-Ayengar.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


కృషివల్లనే భారతస్వరాజ్యము సంపాదింపఁబడవలెనని తీర్మానింపబడెను. ఏతీరున సహాయనిరాకరణ విధానమును ఆచరణలోపెట్టవలెనో అందుకవసరమైన సూచనలన్నియు కాంగ్రెసును వెల్లడియాయెను. అదిమొదలు శ్రీమా౯గారికి కాంగ్రెసు కార్యక్రమమున ఉత్సాహమధికమాయెను.

1922 సం!!న దేశమున అనేకసంభవములు తటస్థించెను. మలబారున మాప్లాలు అల్లరి ప్రారంభించిరి. ఉత్తరహిందూస్థానమున 'చౌరీచౌరా' కాల్పులుజరిగెను. దేశమంతట హర్తాళ్లు, దుకాణముల మూతలు సంభవించెను. దీనిఫలితముగా బొంబాయి నగరమున ఎన్నడులేని అల్లరి జనించెను. ఈపైసంభవములవల్ల గాంధీగారికి తన అహింసాసిద్దాంతముపై పట్టుదలహెచ్చాయెను. దీనిఫలితముగా బర్డోలీలో ప్రారంభింపఁదలచిన పన్నుల నిరాకరణ కార్యక్రమముసు ఆపివేసిరి. తనతీర్మానము గొప్ప పొరబాటని తనకుతెలియునుగాని విధిలేక పైతీర్మానము గావించితినని వెల్లడించిరి. ఆమీద గాంధీగారిపై రాజద్రోహనేరముమోపి వీరిని అధికారులు నిర్బంధించిరి. గాంధీగారు విచారణలో పాల్గొనననియు, తనకు శిక్షవిధించుటకు స్పెషలుకోర్టున కధి