పుట:Sri-Srinivasa-Ayengar.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

67


ఇంటిలోనున్నవారేకాక ఇంటికివచ్చియున్నవారు గూడ ఆశ్చర్యపడిరి. శ్రీగాంధీ, శ్రీస్వామి శ్రద్ధానందగారలు శ్రీమా౯ బంగాళాకు వచ్చినపుడు వీరిని లోపలికితీసికొనివెళ్లి ఇంటివారికి పరిచయము గావించినపుడు అందఱును వందనములసమర్పించిరి. శ్రీ గాంధీ ఆపిమ్మట శ్రీమా నింటివారిని దగ్గరకుపిలచి సంకోచములేక సంభాషించుచుండిరి. కాషాయ వస్త్రముల ధరించిన శ్రీశ్రద్ధానందగారు గంభీరముగ కనఁబడెడివారు. కావున వారిని సమీపించుటకు శ్రీమా౯ కుటుంబమువారు సాహసింపలేదుకాని దూరమునుండి నమస్కరించెడివారు.

1921 సం!! స డిసంబరు 27 వ తేదీన నహమ్మదాబాదున కాంగ్రెసుమహాసభసాగుటకు అన్ని యేర్పాటులు గావింపఁబడెను. శ్రీమా౯గారు అహమ్మదాబాదువెళ్లుటకై సెంట్రలు స్టేషనుకు వెళ్లిరి. ఈ కొంగ్రెసు సమావేశమునకు త్యాగధురీణులగు శ్రీ చిత్తరంజనదాసు అధ్యక్షులుగా ఎన్నుకోబడిరి. కాని ప్రభుత్వమువారు శ్రీదాసుగారిని కారాగారమున నిర్బంధించిరి. కావున హకీమ్‌అజీమల్‌ఖాను గారు శ్రీ సి. ఆర్. దాసుగారి స్థానమున అధ్యక్షులైరి. ఈకాంగ్రెసు సమావేశమునందు సహాయనిరాకరణ