పుట:Sri-Srinivasa-Ayengar.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


పరిష్కారము కాకయున్నందున దీనికిగాను ఎన్నడైన నొకరోజు కోర్టుకువెళ్లుదురేకాని క్రొత్తకేసులపట్టరైరి. ఇంటికివచ్చిన పాతకక్షిదార్లకు తనయభిప్రాయములను కోరినప్పుడు తెలియఁజేయుచుండెడివారు. రాబడి తగ్గినందున పరిస్థితికి తగినట్లు ఖర్చు తగ్గించుకొనుమని ఇంటివారిని అప్పుడప్పుడు హెచ్చరించెడివారు. శ్రీమా౯గారు కాంగ్రెసున చేరినమీదట ఆంజద్‌బాగ్ బంగళాకు నెందరో ప్రముఖులు వచ్చుచుండిరి. దూరప్రదేశములనుండి వచ్చువారు కొందరు వీరి బంగాళాలో బసచేసెడివారు. కాని ఇంటిలోని స్త్రీలకు అతిథులతో నే సంబంధములేక యుండెను. అతిథులు ఇంటిలోపలికి భోజనము సేయుటకు వచ్చినప్పుడు, భోజనముచేసి బయటకు వెళ్లునప్పుడును అతిథులను ఇంటివారు చూచుటకు అవకాశముండెడిది. ఏగొప్పవారు కాని శ్రీమా౯గారి యింట బసచేసి స్వస్థలములకువెళ్లుటకు ప్రయాణమగుచు శ్రీమా౯గారి భార్యకు నమస్కారములు చేసివెళ్లెడివారు. ఇట్టిఆచారము ఉత్తరహిందూస్థానమున గలదని తెలియుచున్నది. ఈయతిథులలో ఒకరగు శ్రీ మహదేవదేశాయి శ్రీమా౯గారి భార్యకు నమస్కారములుచేసి సెలవుపుచ్చుకొనుటను చూచి