పుట:Sri-Srinivasa-Ayengar.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

65


ప్రజలసహాయము ఆశించుచున్నాను. కాంగ్రెసు సభలోనుండి ఏల కృషిసాగింపరాదని నన్ను కొందరు ప్రశ్నించిరి. కాని ఇప్పటి శాసనసభల వాతావరణమున జాతీయవాదిగాను సభ్యుడుగాను ఉండుట వీలుకాదని నేను భావించుచున్నాను.

కాంగ్రెసున శ్రీమా౯గారు ప్రవేశించినమీదట వీరిని ఇంటిలో సందర్శించుటకు కూడ వ్యవధిలేకపోయెను. ఇంటివారుకూడ వీరి నిరంతరప్రయోజనములకు ఆశ్చర్యపడెడివారు. తిథివారముల గణింపక తలచినప్పుడు ప్రయాణము సాగింతురు కావునను, వీరివెంబడి కాంగ్రెసు అనుయాయులు యెందరో రేయుంబవళ్లుందురు కావునను ఇంటివారు వీరితో మాట్లాడుటకు కూడ అవకాశములేక చిక్కుపడెడివారు. ఏయూరికిగాని కాంగ్రెసుపనిమీద వీరు వెళ్లినప్పుడు స్వంతఖర్చులతోనే ప్రయాణముల సాగించెడివారు. ఒక్కొక్కప్పుడు రెండవక్లాసు పెట్టెలోకూడ ప్రయాణము సాగించెడివారు. కాంగ్రెసు సూచించినట్లు పండిత శ్రీమోతీలాలు నెహ్రూ, శ్రీ సీ. ఆర్. దాసు మున్నగువారు కోర్టులకువెళ్లుటమానిరి కావున శ్రీమా౯గారుకూడ హైకోర్టునకు వెళ్లుట మానిరి. పాతకేసు లొకటిరెండు