పుట:Sri-Srinivasa-Ayengar.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


త్వముగూడ వదలుకొంటిని. యూనివర్సిటీ పట్టభద్రులు నన్ను వారిప్రతినిధిగ నెన్నుకొనిరేగాని నావర్తనను వా రాక్షేపింపరనియే తలంచుచున్నాను. నావంటి జాతీయవాదులు ఇండియాకు నితర బ్రిటిషు డొమినియన్లగుండా స్వాతంత్ర్యము లభించుటకు నిరంతరము పాటుబడుట విధి కావున ప్రజాసామాన్యము నాకృషికి తోడ్పడు టవసరమని చెప్పుచున్నాను. శ్రీగాంధీతో నాకు అభిప్రాయ భేదము కలదు కావున, పాఠశాలలు, న్యాయస్థానములు, శాసనసభలు మున్నగువాని బహిష్కరించుటకు దేశము సంసిద్ధముగ లేదని, శాసనోల్లంఘన మసలే సాధ్యముకాదని నాయభిప్రాయము. ఇతర కాంగ్రెసునాయకుల యభిప్రాయములతో పైసందర్భమున నేను అనుకూలత కనబరచకపోయినను అధిక సంఖ్యాకులు శ్రీగాంధీగారి కృషికి తోడ్పడినచో నేను నాయంతరాత్మకు విరుద్ధముగా వర్తింపశక్యముకాదు. క్రిమినలు లా అమెండ్ మెంటు ఆక్టు మున్నగు చట్టముల రాష్ట్రాధికారులు అమలునఁ బెట్టుచున్నందున ప్రజాప్రతినిధు లైనమంత్రులుగూడ నిందుకు సహకారముగ నున్నారు. ఇట్టివారిని ప్రతినిధులుగా నెన్నుకొనక యుండుటకు కొంత ప్రచారముసాగింప నవసరము కావున నిందులకు