పుట:Sri-Srinivasa-Ayengar.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

63


మీద కొన్నిరోజులకు శ్రీమా౯ ఎ. రంగస్వామిఅయ్యంగారు, నేను శ్రీమా౯గారిని సందర్శించి వారి బంగళాలో చాలాసేపు మాట్లాడుచుండగా శ్రీ సత్యమూర్తిగారుగూడ నచ్చటికి వచ్చిరి. మే మందఱము గోఖలేహాలున సభగావించి మీరు అడ్వకేటుజనరల్ పదవి వదలినందుకు అభినందింపఁదలచితిమని శ్రీమా౯గారితో చెప్పగా మాయొత్తిడివల్ల గోఖలేహాలుసభకు వచ్చుటకు అంగీకరించిరి. గోఖలేహాలుసభ జయప్రదముగ సాగెను శ్రీమా౯గారు బ్రిటిషుప్రభుత్వ చర్యలన్నిటిని దీర్ఘోపన్యాసమున నిరసించిరి. సభ్యులకు వీరు అడ్వకేటు జనరలుపదవిని వదలిరని శ్రీ సత్యమూర్తిగారు వెల్లడింపఁగానే హాలునఁ గూడియున్నవారు జయధ్వానములు కొంతసేపుగావించిరి. ఆమీద నీక్రిందియంశములగూర్చి పత్రికలలోకొన్ని వ్యాసముల ప్రకటించిరి.

"భారతదేశమునంతటను అధికారులు ప్రజల ననేకవిధముల బాధపెట్టుచున్నందువల్లనే యీ దురంతముల సహింపలేక అడ్వకేటు జనరలుపదవినే గాక ప్రభుత్వము నాకిచ్చిన C. I. E. బిరుదమును గూడ వదలుకొంటిని. శాసనసభలో నధికారుల చర్యల నిరసించుచు నుపన్యాసములు సాగించితిని గాని యవి నిష్ప్రయోజనమగుటచే శాసనసభ్య