పుట:Sri-Srinivasa-Ayengar.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


దని విస్పష్టముగఁజెప్పి మరునాడు సభలో యాకుబ్ హాస౯గారిచే తీర్మానమును ప్రతిపాదింపించినందుకు శ్రీమా౯గారే గాక యితర ప్రముఖులనేకులు ఆశ్చర్యపడిరి. ఈతీర్మానము ఈమహాసభలో నెగ్గి నందుచే ముందు అనేకచిక్కులు, కక్షలు ఏర్పడి శ్రీ సి. రాజగోపాలాచారి ప్రోత్సాహమున శ్రీగాంధీగారు కలకత్తా స్పెషల్ కాంగ్రెసున సహాయ నిరాకరణతీర్మానమును నెగ్గించుటకు అవకాశ మేర్పడెను.

శ్రీమా౯గారు తిరునల్వేలివదలగానే దక్షిణదేశమున ననేకచోట్లకువెళ్లి సత్కారములనొంది చెన్నపట్టణముచేరుటకు 15 రోజులుపట్టెను. ఇంటికిరాగానే అడ్వకేటుజనరలుపదవిని వదలినట్లే C. I. E. బిరుదముసుకూడ వదలిరి. ఇంటనున్న విదేశీబట్టలు వస్తువులు మున్నగు వాని మూలపడవేసి స్వదేశీవస్తువులు, దుస్తులు మున్నగువానికి ప్రాముఖ్యతయిచ్చుటకు ప్రారంభించిరి. ఆమీద కేరళదేశమునకు ప్రయాణమై కొన్నిసభలలో సహజవాగ్ధోరణితో ప్రభుత్వదురంతముల ప్రజాసామాన్యమునకు తెలియఁజేయుచు నుపన్యాసముల సాగించిరి. కళ్లికోటలో ఒక సభ యందు వీ రుపన్యసించుచు పదవిని, బిరుదమును వదలినందుకు కారణములనుగూడ వెలిబుచ్చిరి.