పుట:Sri-Srinivasa-Ayengar.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

61


పాళయముకోటక్లబ్బు ఆవరణమున ప్రముఖులందఱికిని బసలు ఏర్పాట్లుగావింపఁబడెను కావున బండ్లుదిగి మేమందఱము క్లబ్బున చేరుకొంటిమి.

ఈమహాసభలో పంజాబుదురంతములగూర్చి, శ్రీమా౯గారు గొప్ప ఉపన్యాసముగావించి, ప్రభుత్వోద్యోగులవర్తనను పూర్తిగఖండించిరి. విషయనిర్ణయకసభ రాత్రి 1 గం!! వరకు సాగి యనేకులు వారికితోచిన యభిప్రాయముల వారు వారువెల్లడించిరి. ఆతీర్మానములలో ముఖ్యమైనది 'ఖిలాఫత్‌' గాన దీనిని శ్రీమా౯ ఎస్. కస్తూరి రంగయ్యంగారు మహాసభలో నెగ్గింపవలెనని విషయనిర్ణాయకసభలో తంటాలుపడిరి. శ్రీ సత్యమూర్తిగారు తిరునల్వేలి సమీపములోనున్న పేటలో 30 వేలమంది సమావేశమైన సభలో 'ఖిలాఫత్‌' తీర్మానమునకు అనుకూలముగా ప్రసంగించిరి. ఈసభకు వేలకొలది తురకలుకూడ వచ్చియుండిరి. ఈసంగతి ఉదయము శ్రీమా౯గారికి తెలియఁగానే మండిపడి మహాసభలో శ్రీ సత్యమూర్తిగారు మాట్లాడుటకు అవకాశము ఇవ్వరైరి. ముందురాత్రి శ్రీ కస్తూరి రంగయ్యంగారు శ్రీమా౯గారితో ప్రముఖుల యెదుట ఖిలాపత్ తీర్మానముగూర్చి తనకు పట్టుదలలే