పుట:Sri-Srinivasa-Ayengar.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


స్వామిఅయ్యరు, దివా౯బహదరు శ్రీ గోవిందరాఘవయ్యరు, దివా౯ వి. పి. మాధవరావు, శ్రీ యస్ . కస్తూరి రంగయ్యంగారు, శ్రీ ఏ. రంగస్వామిఅయ్యంగారు, గౌ|| కే. వి. రంగస్వామిఅయ్యంగారు, శ్రీ యస్. సత్యమూర్తి, శ్రీ చల్లా గురుస్వామిశెట్టి, డా. యు. రామారావు, శ్రీ యాకుబ్ హాస౯సేట్, డా. శ్రీ వరదరాజులునాయుడు, చాలకాలము అరవింద ఘోష్‌గారితో సహచరులుగ నుండిన శ్రీ వి. వి. ఎస్. అయ్యరు మున్నగువారేగాక దక్షిణజిల్లాలలో నుండు వకీళ్లు, వర్తకులు అనేకు లీసభకు విచ్చేసిరి. రైలు ఎగ్మూరు స్టేషనువదలినది మొదలు ప్రతిరైలు స్టేషనున వేలకొలదిజనము శ్రీ తిలకుగారిని, శ్రీమా౯గారిని సందర్శించి సత్కరించుటకు హాజరైరికాని అనారోగ్యముచే శ్రీ తిలకుగారు రాలేదని ప్రజా సమూహమునకు తెలియగానే వారు నిస్పృహులైరి. రైలుమార్గమున శ్రీ తిలకుగారికి సత్కారముగావింప వలసిన ఏర్పాట్లన్నియు శ్రీమా౯గారికికూడ లభించెను. మరునాటి రాత్రి 8 గం|| తిరునల్వేలి రైలుస్టేషను దిగగానే 6 ఏనుగులు కనఁబడెను. 3 ఏనుగులు ముందును, 3 ఏనుగులు వెనుకను నడచుచుండగా రైలుస్టేషనునుండి పాళయముకోటవరకు, గౌరవార్థము వేలకొలది. ప్రజలతో నిండెను.