పుట:Sri-Srinivasa-Ayengar.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

59


నకు ఇప్పట్లో తా నే సేవయు గావింపలేననిచెప్పిరి. సహాయనిరాకరణోద్యమము వీరిదృష్టిని ఆకర్షింపలేదు. కావుననే యూనివర్శిటీ స్థానమునకు పోటీచేసి మదరాసు రాష్ట్రశాసనసభ్యులైరి. రాష్ట్రసభలో ప్రభుత్వకక్షకు వ్యతిరేకముగా నుపన్యాసముల నిచ్చుటకు ప్రారంభించిరి. కాని యిందుతో వీరి యాశయము పూర్తికాలేదు. 1920 సం!! న మదరాసు రాష్ట్రమున రాజకీయమహాసభను వైభవముగ జరుపుటకు తిరునల్వేలి జిల్లావాసియు, సుప్రసిద్ధజాతీయ వాదియు, దేశసేవకుఁడు నగు శ్రీ వి. ఓ. చిదంబరం పెళ్లెగారు ఏర్పాట్లుగావించిరి. ఈమహాసభకు పూనానుండి శ్రీ బాలగంగాధరతిలక్ మహాశయులు మున్నగువారు వచ్చుట కంగీకరించిరి.

1905 సం|| తిరునల్వేలిలో మదరాసురాష్ట్రమహాసభ శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరుగారి యాజమాన్యమున జరిగెను. శ్రీ చిదంబరంపిళ్లెగారు శ్రీమా౯ అయ్యంగారిని 1920 వ మహాసభకు నధ్యక్షులుగా నుండు మని కోరి యందుకు వీరు సమ్మతించినమీదట నాహ్వానసంఘమును సమావేశపఱచి శ్రీమా౯గారిని అధ్యక్షునిగా నేకగ్రీవముగా నెన్నుకొనునట్లుచేసిరి. ఈమహాసభకు భారతీయ ప్రముఖులనేకులు వచ్చిరి. గౌ|| వి. ఎస్. శ్రీనివాసశాస్త్రి, శ్రీ సి. పి. రామ