పుట:Sri-Srinivasa-Ayengar.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


అయ్యంగారు అభిమానమునకు పాత్రులైరి. రామనాథపురసంస్థానము పనిమీద శేషాద్రిఅయ్యంగారు చెన్నపట్టణమువచ్చినపుడెల్ల, సర్. వి. భాష్యంఅయ్యంగారు లక్ష్మీవిలాసమున బసచేసెడివారు.

అప్పుడప్పుడు తల్లినిపోగొట్టుకొనిన అభిమాన పుత్రుడగు శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారును చెన్నపట్టణమునకు వెంటపెట్టుకొని వచ్చెడివారు. శేషాద్రిఅయ్యంగారు 3 పెళ్లిళ్లు చేసికొనిరి. మొదటి భార్యకు సంతానము లేనందున భార్యతో చెప్పకనే దేవాలయమున రెండవపెళ్లిచేసికొని యింటికివచ్చి జ్యేష్ఠభార్యనుపిలచి హారతియివ్వమని చెప్పిరట. మొదటిభార్య దిక్కుతోచక హారతిని సమర్పించెనట. శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారుతల్లి రెండవభార్య, శ్రీమా౯గారి మూడవయేట మరణించెను. ఆమీద మరల మూడవపెళ్లి చేసికొనిరి. ఈ భార్యకు ఎస్. వెంకటేశఅయ్యంగారు రెండవకుమారుడు జన్మించెను. మూడవభార్యగూడ శ్రీవేంకటేశ అయ్యంగారికి మూడేండ్లు పూర్తిగాకముందే మరణించెను గాని శ్రీశేషాద్రిఅయ్యంగారు ఆమీద వివాహప్రయత్నమును మానుకొనిరి. శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారిని పెంచి పెద్దకావించినది. వీరి మేనత్తయగు వృద్ధురాలు. తల్లి లేనిబాలుఁడని తండ్రి