పుట:Sri-Srinivasa-Ayengar.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

9


చూపు పరామర్శవల్ల మొండిశిఖండిగా శ్రీమా౯ బాల్యమున వర్తించెడివారు. ఈక్షణమున మధుర మీనాక్షీ దేవాలయమునందలి ఏనుగు తమ యింటి వాకిటకు వచ్చినగాని తిండితినను అని పట్టుబట్టిన మీదట తండ్రిగారికిఁ గల ప్రాభవముచే ఆఏనుగు ఇంటివాకిటకు వచ్చుటయు శ్రీమా౯గారు ఆమీద అన్నము తినుటయు జరిగెడిది. శ్రీమా౯ ఏది కోరినను తండ్రిగారు సరఫరాచేయుటవల్ల వీరికి మధురలో ఏర్పడిన పలుకుబడియే కారణమని చెప్పవచ్చును. మధురపురవాసులు దానప్పమొదలి అగ్రహారం శ్రీశేషాద్రిఅయ్యంగార్ అని చెప్పుకొనెడివారు. చెన్నపురిలో శ్రీభాష్యంఅయ్యంగారు బంగళాలో కుమారునితో వీరుబసచేసియున్నప్పుడు రాత్రి 9 గంట లప్పుడు, ఈక్షణమున నాకు బొమ్మ రైలుఇంజను కావలెను అని శ్రీమా౯ అల్లరి ప్రారంభించెను. ఎవరేమిచెప్పినను వినక కేకలువేయుచుండగ వీరివలె అల్లరిసాగించు భాష్యంఅయ్యంగారి అభిమానపుత్రుఁడు దేశికాచారిని శ్రీమా౯ దగ్గఱకు తీసికొనివచ్చి నిలఁబెట్టిరి. శ్రీమానునుజూడగానేఁ దేశికాచారిసాగించు అల్లరిని మానెను. కాని శ్రీమా౯ అల్లరిసాగించుచుండెను. బండిమీద పట్టణముస బజారునకువెళ్లి అంగళ్లువెదకి ఒక బొమ్మ