పుట:Sri-Srinivasa-Ayengar.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

7


నాథపురసంస్థాన న్యాయవాది గావించిరి. శ్రీపొన్నుస్వామి దేవరగారు మరణించినందున రామనాథపుర సంస్థానకోర్టు వ్యవహారములనేగాక సంస్థానీకుల కుటుంబవ్యహారములను గూడ నిర్వహించుచుండిరి. శ్రీపొన్నుస్వామి దేవరగారి ముగ్గురు కుమాళ్లును మైనర్లగుటచే కనిష్ఠకుమారుఁడు పాండిదొర మేజరై జమీను వ్యవహారముల నిర్వహించుకొనువరకు శ్రీ శేషాద్రిఅయ్యంగారే అన్నిపనుల నిర్వర్తించు చుండిరి. శ్రీపొన్నుస్వామి దేవరగారి కుమాళ్లకు వయస్సురాగానే చాలాకాలము శ్రీశేషాద్రిఅయ్యంగారు కోర్టుపనులు మాత్రము చూచుచుండిరి,

శ్రీ ముత్తురామలింగసేతుపతిగారి స్వీకారకేసున వీరు మొట్టమొదట చెన్నపట్టణమునకు వెళ్లవలసివచ్చెను. చెన్నపట్టణమునకు రాగానే అప్పటి వకీళ్లలో ప్రముఖులైన సర్. వి. భాష్యం అయ్యంగారితోను, సుప్రసిద్ధ బారిస్టరగు శ్రీనార్టనుతోను శేషాద్రిఅయ్యంగారు సంప్రతించుచుండిరి. ఆమీద ఎప్పుడు చెన్నపట్టణమునకు వచ్చినను, నార్ట౯గారికి స్వీకార కేసువిషయమై తెలియ జేయవలసిన అంశములు దెలియజేయుచు నార్టను మున్ననకు పాత్రులైరి. ఈ పైకేసు సలహాదారులుగ నుండుటవల్లనే ప్రబలహైకోర్టు న్యాయవాదియగు సర్. వి. భాష్యం