పుట:Sri-Srinivasa-Ayengar.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


వీలుండెను. శ్రీ శేషాద్రిఅయ్యంగారుగారికి ఆరవము నందేగాక సంస్కృతమునందుకూడ చక్కని ప్రవేశముండెనని తెలియుచున్నది. ఐరోపీయనుల ఎదుట ఒకమోస్తరుగా సంభాషించుటకు కూడా : వీరికి శక్తియుండెనని తెలియుచున్నది. వార్తాపత్రికలు పుస్తకములు మున్నగువాని నుండి కొన్ని అంశములు తెలిసికొని ఒక మోస్తరుగా ఇంగ్లీషుపుస్తకమును చదువుటను ప్రారంభించిరట. ఐతే ఇంగ్లీషున చేవ్రాలుచేయుటగూడ వీరికి శక్యముగాదట.

స్వయంకృషివల్ల ఇంగ్లీషుపుస్తకము చదవనేర్చిరో కావునను గురువువద్ద శిక్ష లేనందువల్లను వీరి ఆంగ్ల పరిచయము వృద్ధికాలేదు. వీరు కోర్టులలో అరవముననే వాదించుటనుగూర్చి అనేకులు పొగడు చుండుటను విని శ్రీరామేశ్వర పండారసన్నిధికి వీరిని ప్లీడరుగా నియమించెను. శ్రీశేషాద్రిఅయ్యంగారి శక్తిని గుర్తించి వీరిని పిలిపించి శివగంగ జమీ౯కు ప్లీడరుగా నియమించిరి. అప్పుడు రామనాథపురము శ్రీపొన్నుస్వామి దేవరవారికిని, వారి అన్నభార్య యగు జమీందారిణికిని కలతలేర్పడి శ్రీముత్తురామలింగ సేతుపతిగారిని స్వీకారపుత్రునిగావించిన మీఁదట దానినిగూర్చి గొప్పకలతలేర్పడ శ్రీపొన్నుస్వామి దేవరగారు శ్రీశేషాద్రిఅయ్యంగారిని రామ