పుట:Sri-Srinivasa-Ayengar.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

55


లీలతోనిలచుట కొందఱికి గొప్పగ కనఁబడినదేగాని శ్రీమా౯గారు ఇట్టిదర్జాల లక్ష్యపెట్టువారుకారు. శ్రీమా౯గారికృషివల్లనే అడ్వకేటుజనరలునకు భృతి హెచ్చింపఁబడెనుగాని వీరు అడ్వకేటుజనరలుగా నున్నప్పుడు 1500 మాత్రమే నెలకు లభించుచుండెను. తనకార్యదీక్ష, బుద్ధికుశలత అపారసామర్థ్యము మున్నగువానిపై వీరికి పూర్తిగా నమ్మకమున్నందువల్ల తనమిత్రులు సందర్శించినపుడు తానుసాగించు ఉన్నతకార్యములఁగూర్చి చెప్పెడివారు. పదవినిచ్చిరని ప్రభుత్వమును గొప్పగభావింపక తసయోగ్యత వల్లనే పదవినిచ్చిరని తలంచెడివారు.

శ్రీఆనిబిసెంటుగారు హోంరూలు ప్రచారము సాగించుచు తన న్యూఇండియాపత్రికలో తీవ్రముగ మదరాసు ప్రభుత్వమును నిరసించుచుండెనని అధికారులు చర్యపూనినపుడు శ్రీమా౯గారు అడ్వకేటుజనరలుగనున్నందుచే ఆనిబిసెంటునకు విరుద్ధముగ హైకోర్టున దావాలలో వాదింపవలసివచ్చెను. ఉభయులకు నాడుపత్రికలలో వివాదములు సాగుచుండెను. ఆనిబిసెంటునకు ప్రతికూలముగ వర్తించినచో శ్రీమా౯గారిని చంపివేయుదుమని ఆకాశరామన్నజాబులు వీరికివచ్చెనుగాని వీనినెంత మాత్రములక్ష్య పెట్టక విధ్యుక్తకార్యముల నిర్వ