పుట:Sri-Srinivasa-Ayengar.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


C. I. E. బిరుదు ఇచ్చినచో సంతృప్తిజెంది ప్రభుత్వ చర్యల నన్నిటిని నామోదించునని రాష్ట్రఅధికారులు తలచినది పొరబాటు. స్వతంత్రబుద్దిగల వీరు ఏవిషయమునుగాని తన యంతరాత్మసూచించునట్లు విమర్శించుట వీరి అలవాటు కావున నితరుల సంతృప్తి గావించుటకై స్వీయాభిప్రాయముల దాచుకొందురని అధికారులు తలచినది హాస్యాస్పదము. ఏపదవి తన కక్కరలేదనియు తన విధ్యుక్త కార్యముల తనకు తోచినట్లు నిర్వహింతుననియు ఒకమారు గవర్నరుగారితోచెప్పిరట. శ్రీగాంధీతో భిన్నాభిప్రాయములు జనించినపుడు కాంగ్రెసుసంస్థకు సంబంధించిన పదవులన్నిటిని తృణప్రాయముగఁజూచి ప్రముఖులెందరు ఎంతజెప్పిననువినక కొందఱు ప్రజలు వీరిని అల్లరిసాగించువారని చెప్పుచున్నను నిర్లక్ష్యముగనుంటూ తనసిద్దాంతములకు విరుద్ధముగా ఎన్నడును వర్తింపనని ఘంటాపథముగా శ్రీగాంధీగారితోచెప్పిరి. ఎందునగానీ తనచిత్తవృత్తికి భిన్నముగా ఎన్నడును వర్తింపరనుసంగతి లోకవిదిత మాయెను. వీరు ఆరోజులలో అడ్వకేటుజనరలు పదవిలోనుండుట కుటుంబమువారికి సంతృప్తినికలిగించెను, వాకిట నిద్దరు జవానులు డబ్బాడవా