పుట:Sri-Srinivasa-Ayengar.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

53


నిత్తురని వార్త బయలుదేరెను కాని, ఆపదవిని స్వీకరించుటకు వీరికిష్టములేదని రాష్ట్రగవర్నరు తెలుసుకొని పైకితెలియజేసెను. కావున వీరు న్యాయవాదిగనే కాలముగడపిరి. కొన్నిమాసములలో శ్రీమా౯గారిని రాష్ట్రగవర్నరు కౌన్సిలుమెంబరు గావింతురని యనేకులు అనుకొనుచుండిరి. వీరికధికారులు C. I. E. అను బిరుదమును యిచ్చిరేకాని కౌన్సిలుపదవిని వీరికేల నివ్వలేదో యెవరికిని తెలిసినదికాదు.

1919 సం|| వీరు రాజ్యాంగసంస్కరణల మహాసభకు అధ్యక్షులైరి. అడ్వకేటుజునరలు కావున ఆచారప్రకారము వీరు మదరాసురాష్ట్ర శాసన సభ్యులుగనుండి మదరాసు ప్రభుత్వమునకు సలహాలనిచ్చుటయేగాక అనధికారసభ్యులు ఎవరైన శాసనసభలో న్యాయసంబంధమైన ప్రభుత్వచర్యల ఆక్షేపించినచో అడ్వకేటుజనరలైన వీరు వారికి సమాధానము చెప్పుటయేగాక ప్రభుత్వవర్తనను బలపఱచుచుండెడివారు. కొన్ని సందర్భములలో స్వీయాభిప్రాయములకు విరుద్ధముగ శాసనసభలో వ్యవహరించుట వీరికి ప్రాణాకంటకముగ నుండెను. అప్పుడప్పుడు ప్రభుత్వమువారికిని శ్రీమా౯గారికిని అభిప్రాయభేదములు జనించుచుండెను. వీరికి