పుట:Sri-Srinivasa-Ayengar.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


తెలియును గావునను డాక్టరుగారి సంభాషణలే శ్రీమా౯వారికిని శ్రీఅనిబిసెంటునకు అభిప్రాయభేదము హెచ్చెనని అనేకులు అనుకొనుచుండిరి.

1916 సం|| శ్రీమా౯గారు అడ్వకేటుజనరలుపదవిని స్వీకరించిరి. ఈపదవికి వీరు మొదట తాత్కాలికముగ నియమింపబఁడి ఆమీద దీర్ఘకాలము ఈ పదవిలోనుండుటకు అవకాశమును సంపాదింపగల్గిరి. పదవిఖాయముకాగానే కాంగ్రెసుప్రముఖులును సుప్రసిద్ధజాతీయవాదియునైన హిందూముస్లిం అల్లర్లలో శిక్షజెందినవారును భారతదేశమంతటను కీర్తి గడించినవారును అగు శ్రీ సేలము విజయరాఘవాచారిగారు శ్రీమా౯గారికి అడ్వకేటుజనరలుపదవి లభించినందుకు వీరిని కీర్తించిరి. అప్పట్లో శ్రీ విజయరాఘవాచారిగారు మదరాసు రాష్ట్రశాసనసభ్యులుగ నుండెడివారు. వీరికి దక్షిణదేశమున పలుకుబడి హెచ్చుగావున క్రమేణ ఢిల్లీఅసెంబ్లీ సభ్యులగుటయేగాక నాగపూరుకాంగ్రెసుసమావేశమునకు అధ్యక్షులుగ యెన్నుకోబడిరి. ఈమహనీయుఁడు సామాన్యులపొగడువాడుకాడు. శ్రీమా౯గారు అత్యున్నతవ్యక్తియని గుర్తించియే వీరిని అభినందించిరి. అప్పట్లో శ్రీమా౯గారికి హైకోర్టుజడ్జిపదవి