పుట:Sri-Srinivasa-Ayengar.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

51

డాక్టరు ఆనిబిసెంటు హోమ్‌రూలు ఉద్యమమును ప్రారంభించినపుడు శ్రీమా౯గారు ఆనిబిసెంటు వర్తనను ఆమోదించిరి. కాని, అడ్వకేటుజనరలుపదవిలోనున్నందు వల్లను, అడయారు ధియసాఫికల్ సొసైటీ సిద్ధాంతములపై వీరికి నమ్మకము లేనందునను, ఈసొసైటీ రహస్యగోష్ఠులలోని చర్యలను నిరసింపువలసివచ్చినందుచే కొంతకాలమునకు శ్రీ అనిబిసెంటు గారికృషికి ఏసహాయముగావింపరైరి. శ్రీ జి. కృష్ణమూర్తిని దత్తునిగా స్వీకరించుటయు ఆమీద కృష్ణమూర్తితండ్రి హైకోర్టున దావావేయుటయు దివ్యజ్ఞానసామాజికులకు సంతృప్తికలిగింపవచ్చునుగాని తనకు ఆనిబిసెంటువర్తన యేమాత్రము గిట్టదని చెప్పుటకు ప్రారంభించిరి. ఈసమాజమునందు సభ్యులుగనున్న డాక్టరు శ్రీనంజుండరావుగారు శ్రీమా౯గారి యింటిడాక్టరుగావున్న రోజూ శ్రీమా౯గారి యింటికివచ్చెడివారు. వచ్చినప్పుడెల్ల శ్రీమా౯గారితో థియసాఫికల్సొసైటీ చర్యలగూర్చిచెప్పెడువారు కావునను శ్రీ అనిబిసెంటుపై శ్రీకృష్ణమూర్తి దత్తసుగూర్చి శ్రీ సంజుండరావుగారు దావా దాఖలుచేయించిరి కావునను థియసాఫికల్ సొసైటీన జరగువృత్తాంతములన్నియు డాక్టరుగారికి చక్కగా