పుట:Sri-Srinivasa-Ayengar.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


హృదయాహ్లాదమును శ్రీమా౯ వెలిబుచ్చుచుండును. వారి గుణాతిశయములు ఉదారబుద్ది సునిశితవిమర్శనాపటిమమున్నగువాని అప్పుడప్పుడు ప్రశంసించుచు శ్రీమణిఅయ్యరు కూడ తమవలె మధురవాసి యనెడివారు. మదరాసు యూనివర్శిటీ సెనెటునకు పట్టభద్రులచే యెన్నుకోబడి నాలుగు సం||ల కాలము సెనెటు మెంబరుగ నుండిరి.

1914 వ సం!! చెన్నపట్టణమున కాంగ్రెసుసమావేశముజరిగినప్పుడు శ్రీమా౯గారు సన్మానసంఘ కార్యదర్శిగ యెన్నుకోబడి అన్నిపనుల చక్కగనిర్వహించిరి. మరొక కార్యదర్శియగు శ్రీ జి. ఎ. నటేశయ్యరుగారు ఆహ్వానసంఘ టిక్కెట్లలో తనపేరు వేసికొనగా శ్రీమా౯గారు దీనిగుర్తించి యెవరిపేరు టిక్కెట్లలోనుండరాదనియు ఆహ్వానసంఘాధ్యక్షుల పేరుమాత్రమే ముద్రింపఁబడవలెననియు, శ్రీ జి. ఎ. నటేశ౯గారికి నొకజాబువ్రాసి కోర్టుపనిమీద మధురకువెళ్లుచు టిక్కెట్టుప్రూపు తానామోదించినమీద ముద్రణము కావలెనని తెలియజేసిరి. వీరిష్టప్రకారమే విధిలేక జి. ఎ. నటేశ౯గారు మధుక నుండి శ్రీమా౯ రాగానే టిక్కెట్లప్రూపుల కనఁబఱచి ఆమీఁద వీని ముద్రింపించెను.