పుట:Sri-Srinivasa-Ayengar.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


హించుచుండిరి. శ్రీఆనిబిసెంటుగారిని జైలునపడవేయవలయునని గవర్నరు పెంట్‌లె౯డ్ అభిప్రాయపడి శ్రీమా౯గారి సలహానుకోరగా గొప్పవ్యక్తియగు ఆనిబిసెంటును సామాన్యఖైదీగ భావింపరాదనియు ఉదకమండలమున ఒకప్రదేశమున వీరిని కాపుదలతో నుంచుమనియు శ్రీమా౯గారు సలహా చెప్పితినని మిత్రులతో చెప్పెడివారు. అప్పటినుండియే అడ్వకేటుజనరలుపదవిని వదలుకోవలెనను నూహ వీరికి జనించెను.

పెంట్లె౯డ్ ఇంగ్లాండువెళ్లినమీదట విల్లి౯గ్డ౯ మదరాసు రాష్ట్రగవర్నరాయెసు. కాని వీరిమధ్య మనస్పర్థలు క్రమేణహెచ్చాయెను. అడ్వకేటుజనరలుగ వీరు సూచించిన సలహాలు విల్లి౯గ్డనుకు ప్రాణకంటకముగనుండెను. కావున గవర్నరుగారిపార్టీలకు గూడ వీరువెళ్లరైరి. తనంతట తాను గవర్నరును సందర్శించుటమాని వీరాహ్వానించినపుడు మాత్రమే గవర్నమెంటు హౌసుకువెళ్లెడివారు. ఇందుకు కొన్ని సంవత్సరములు ముందే ఐరోపియనులపై ఒక మోస్తరు నిర్లక్ష్యభావము వీరియందంకురించెను. కొన్ని సందర్భములలో ఐరోపియనులు భారతీయుల కన్న గొప్పవారని తనమనస్సున అభిప్రాయమున్నను, భారతీయుఁడెవఁడుగానీ విదేశీయునిచే చులకనగా