పుట:Sri-Srinivasa-Ayengar.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

47


పలహారముల త్యజించెడి యలవాటు మామగారింటిలో వీరున్నప్పుడు ఏర్పడెను. స్వదేశమున నీతీరుగ ప్రయాణము సాగించిన శ్రీమా౯ కాంగ్రెసు పనిమీద దూరప్రదేశములకు వెళ్లినప్పుడుగానీ, విదేశములకు వెళ్లినప్పుడుగానీ తనతో నౌకరి రా నక్కఱలేదని చెప్పుట యందఱికిని ఆశ్చర్యము కలిగించెను. సదా వీరివెంబడి నౌకరియుండవలెనని వీరికి పట్టుదల లేదు. కాంగ్రెసు పనులమీదనే కేసులకై బయటికి వెళ్లినప్పుడుసు కస్తూరిని తీసికొని వెళ్లుచుండిరి కాని విదేశములకు వెళ్లినప్పుడు ఒంటరిగా వెళ్లిరి. ఆరోజులలో అప్పుడప్పుడు ఆంజాద్‌బాగ్‌లోన గొప్పటీపార్టీలు సాగుచుండెను. ఇందుకు హారిస౯కంపెనీవారు కంట్రాక్టర్లుగా నుండిరి. కాని గాంధీగారి గౌరవార్థము కావించిన వించుకు హారిస౯కంపెనీవారిని రప్పింపరైరి. వీరి కుటుంబమువారు గవర్నమెంటుహౌసు విందునకు వెళ్లెడివారు. లార్డ్ పెన్ట్‌లండ్ గవర్నరు భార్యను, శ్రీమా౯గారిభార్య అంజాద్ బాగున కౌహ్వానించి గొప్ప టీపార్టీ నిచ్చిరి. ఈ పార్టీకి మహిళలనేకులు హాజరైరి.

శ్రీమా౯గారి కుమార్తె శ్రీ అంబుజమ్మాళ్ గారికి విద్యనేర్పుటకై ఒక ఆంగ్లస్త్రీని నియమించిరి. చదివించి నంతమాత్రమున తాను సంతృప్తిచెందననియు,