పుట:Sri-Srinivasa-Ayengar.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


యూనివర్సిటీన ఆర్థికశాస్త్రమునుగూర్చి ప్రముఖులుపన్యసించుటకై 10 వేలు యూనిర్సిటీ కిచ్చిరి. శ్రీగాంధీగారు కాంగ్రెసుప్రచారము ప్రారంభించి వీరి సహాయముసుకోరగా 10 వేలు విరాళముగ నిచ్చిరి. ఈపెద్ద మొత్తములు ఇంటివారికి తెలియునే కాని చిల్లర మొత్తములు ఎవరెవరికి ఎప్పుడు ఇచ్చిరో ఎవరికి తెలియదు. రామనాథపురమునందు తాను జన్మించిన యింటిని చక్కఁజేసి 25 వేలు ఖర్చుపెట్టి ఒకహాలు నిర్మించి యిందు లైబ్రరీని, నాటకశాలను ప్రజోపయోగమునకై నిర్మించిరి. ఇందుకై వీరికుమారులు శ్రీ ఎస్. పార్టసారథి శ్రీమా౯ మరణించినమీదట కొంతసొమ్ము వెచ్చించి లైబ్రరీని వృద్ధిచేసెను.

ఎచ్చటికైనను ప్రయాణము సాగింపవలసివచ్చినచో శ్రీమా౯గారికి ప్రత్యేకముగ సన్నబియ్యము, నేయి, అప్పడములు, ఊరగాయలు, అన్నపుపొడి మున్నగునన్నిటిని, వంటమనిషినికూడతీసికొని వెళ్లుచుండును. వీరు పైవారు తయారుచేసిన కాఫీని గాని, ఫలహారమునుగాని పుచ్చుకొనెడువారు కారు. కావున వంటమనిషి కస్తూరి వీరికి కావలసిన వన్నిటి కుక్కర్ పైనో కుంపటిమీదనో సిద్ధము గావించే అలవాటు. బయటినుండి తెప్పింపఁబడిన