పుట:Sri-Srinivasa-Ayengar.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

45

నెలకు 10 వేలకుపైగా ఆర్జన యున్నప్పుడు గూడ డబ్బుండెడి పెట్టెవద్దకు వెళ్లువారుకారు. పెట్టెతాళపు చెవిని, జమాఖర్చు లెక్కలచూచు అలవాటు వీరికి నలవడలేదు. కుటుంబ ఖర్చులన్నియు వీరి భార్యగారే నిర్వహించుచు, గుమాస్తాసహాయమున లెక్కల వ్రాయించుచుండిరి. శ్రీమా౯గారికి తన భార్యసొమ్ము వృథాగా ఖర్చుపెట్టదను నమ్మక ముండెను కావునను, లెక్కల చూచుటలో లోపముండదని నమ్మువారు కావున కుమారుఁడు కుమార్తె యాతీరున తల్లివలె వ్యవహరింప నేర్చుకొనవలెనని చెప్పుచు పుస్తకములు చదువుటవలన నీప్రతిభరాదని చెప్పెడివారు. వీరి యుదారబుద్దివల్ల లాభము చెందినవారు అనేకులు గావున వీరు శ్రీమా౯చేసిన సహాయమునుగూర్చి మదరాసు యూనివర్సిటీన బి. ఏ. పరీక్షలో అగ్రస్థానము వహించిన విద్యార్థికి ఒక బంగారుపతకమును' తస మామగారగు శ్రీ సర్.వి. భాష్యంఅయ్యంగారిపేర ప్రతిసంవత్సరము ఇచ్చుటకై 5 వేలు ఇచ్చిరి. పండిత శ్రీమదనమోహనమాలవ్యాగారు ప్రారంభించిన కాశీ విశ్వవిద్యాలయమునకు 10 వే లిచ్చిరి. శ్రీగోపాలకృష్ణగోఖలేగారిపేర ప్రతిసంవత్సరము మదరాసు