పుట:Sri-Srinivasa-Ayengar.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

శ్రీమా౯గారు ఏటాదుస్తులకై వేయిరూపాయలు ఖర్చుపెట్టెడివారు. ఉదయము నిత్యకృత్యముల నిర్వహించుకొని ఆఫీసుగదిలో కేసులను, కక్షిదారుల సమక్షమున చదివెడువారు. 9 గం|| కాగానే డ్రాయింగుహాలునకువచ్చి కచ్చేరి సాగించెడివారు. ఈలోగా వంటమనిషి వెండిగిన్నెలో మోరు అన్నము పులుసుఅన్నము అప్పడములు, వడియములు, ఊరగాయలు మున్నగువాని సిద్ధముగావించుకొని ఎదుట నిలఁబడియుండును. ఒకచేతిలో కోటు తగిలించుకొని మఱొకచేతితో వంటవాఁడు అందిచ్చు గిన్నెలలోని అన్నమును నిలచుకొని భుజించెడివారు. ఈలోగా అప్రెంటీసులలో ఎవరైన ఒకరు పాగా చుట్టి తెచ్చియిచ్చుటయు, భార్య నెక్ టై తగిలించుటయు నౌకరిబూట్సును కాళ్లకు తొడుగుటయు, ఆమీద వీరు కోర్టుకు ప్రయాణమగుటయు జరిగెడిది. వీరు కోర్టుకు వెళ్లులోపలనే ఒక ఝడివాన కురిసి నిలచినట్లే యింటివారందఱు భావింతురు. సిల్కు దుస్తులధరించు శ్రీమా౯గారు శ్రీగాంధీతో సంబంధము ఏర్పడినమీదట, పూర్వము ధరించుచుండిన దుస్తులపై వ్యామోహము వదలిరేమో, యని యింటివారేగాక పైవారు కొందఱును భావించిరి గాని యట్లు గావింపరైరి.