పుట:Sri-Srinivasa-Ayengar.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

43


బరోడా సంస్థానదివాను దివాన్‌బహదూర్ శ్రీ ఎస్. శ్రీనివాసరాఘవయ్యంగారు, బరోడాకు మొదట దివాన్ ఆమీద తిరువాన్కూరు సంస్థాన దివానుగ నుండిన సర్. శ్రీ టి. మాధవరావుగారు, మద్రాసు హైకోర్టు ప్రధానన్యాయమూర్తి సర్ . శ్రీ ఎస్. సుబ్రహణ్యఅయ్యరే గాక మరి నాల్గున్యాయమూర్తులు, సర్. శ్రీ వీ. భాష్యంఅయ్యంగారు. శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరు శ్రీ పి. ఆర్ . సుందరయ్యరు, సర్. శ్రీ కె. శ్రీనివాసయ్యంగారు ఆరోడ్డులో వసించుచుండిరి. అంజద్‌బాగ్ బంగళాసు శ్రీమా౯గారు 20 వేలకుకొనిరి; ఆమీద 20 వేలు ఖర్చుపెట్టి దీనిని నూతనబంగళాగ మార్చిరి. ఈ బంగళా పూర్వము డిసిల్వగారి దనియు అనేక చేతులు మారి చివరకు ఒకమహమ్మదీయస్త్రీకి వశమాయెననియు ఈమె యొక మొదలారికి విక్రయింపగా వారివద్దనుండి శ్రీమా౯గారు కొన్నారనియు తెలియుచున్నది. ఇందు ప్రవేశించిన మీదట శ్రీమా౯గారి ఆదాయము హెచ్చి నెలకు 10,000 పైగా సంపాదింపగల్గిరి, కావున కుటుంబము వారందఱుసు సంపన్నులై తమ జీవితమును ఉన్నతస్థాయిలో గడప వీలాయెను.